
నవతెలంగాణ-డిచ్ పల్లి : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రాబిన్ శర్మ సైకిల్ పై దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను విద్యార్థులను అవగాహన కల్పించడం హర్షనియమని సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి తెలిపారు.గురువారం ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఈ సందర్భంగా రాబిన్ శర్మ, సర్పంచ్ మోహన్ రెడ్డిని మాట్లాడుతూ 448 రోజుల నుండి దేశమంతా తిరుగుతూ ప్రచారం పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తుండడం విశేషమని, రాబిన్ శర్మ కల్పించడం ఎందరికో ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.