చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం.

నవతెలంగాణ- ఆలేరు టౌన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో,  చేనేత పరిశ్రమ  కార్మికుల అంశాలను వివిధ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని మంగళవారం  తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రతి చేనేత మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి 10 లక్షల రూపాయల పెట్టుబడి సహాయం అందించాలని , చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరపాలని ,చేనేత సహకార సంఘాల, కార్మికుల రుణాలను మాఫీ చేయాలని ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని , తెలంగాణ చేనేత కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని , చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వమే చేనేత వస్త్ర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కావలసిన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించాలని , చేనేతపైన ఉన్న జీఎస్టీ ని రద్దు చేయాలని, చేనేత సహకార సంఘాలకు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టవద్దు  అన్నారు.  ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో శాసనమండలి మాజీ సభ్యులు చెరుపల్లి.సీతారాములు చేనేత పరిశోధకులు డి.నరసింహారెడ్డి పద్మశాలి సంఘం అఖిలభారత అధ్యక్షులు కందగట్ల.స్వామి చేనేత కార్మిక సంఘం సలహాదారులు కూరపాటి. రమేష్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బడుగు.శంకరయ్య, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం. శాంతి కుమార్, కార్యదర్శి మురళి,చేనేత కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్యదర్శి పాషికంటి .లక్ష్మీనరసయ్య, చేనేత వర్గాల చైతన్య వేదిక కన్వీనర్, చిక్కాదేవదాస్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులు రాపోలు.జగన్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చెన్న. రాజేష్, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు కందగట్ల. బిక్షపతి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరపాటి. రాములు, శ్రీపతి. సత్యనారాయణ, దుడుక. ఉప్పలయ్య, యాదయ్య, లక్ష్మీ, కందగట్ల. గణేష్ , కోడం. రమణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love