అరాచకాలు, దాడులకు, అక్రమాలకు కేరాఫ్‌గా రౌడీ రమేష్‌

– ఎర్రబోయిన నాగేశ్వరరావు హత్యలో ప్రధాన నిందితుడు ఉమ్మనేని రమేష్‌ : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-బోనకల్‌
అరాచకాలకు, దాడులకు, అక్రమాలకు, అవినీతికి కేరాఫ్‌గా ఉమ్మనేని రమేష్‌ తయారయ్యాడని సీపీఐ(ఎం) నాయకులు కళ్యాణపు బుచ్చయ్య, పొన్నం రాంబాబు, మాదినేని వీరభద్రరావు, కళ్యాణపు బుచ్చయ్య, ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, ఉప సర్పంచ్‌ కారంగుల చంద్రయ్య తెలిపారు. శనివారం ఎర్రబోయిన నాగేశ్వరరావు హత్యలో ప్రధాన నిందితుడైన ఉమ్మనేని రమేష్‌ గురంచి వివరాలను సీపీఐ(ఎం) నాయకులు విలేకరులకు వివరించారు. మండల పరిధిలోని గోవిందాపురం ఎల్‌ గ్రామానికి చెందిన ఉమ్మనేని రమేష్‌ సర్పంచ్‌ ఉమ్మనేని బాబు కుమారుడు. గ్రామంలో అరాచకాలు సష్టించటం, ఎవరిని పడితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, ఇసుక అక్రమ వ్యాపారం చేస్తూ ఇసుక మాఫియా డాన్‌గా మారిపోయాడు. వైరా సబ్‌ డివిజన్‌ పరిధిలో మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కెల్లాడని ఆరోపించారు. ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చిందన్నారు. గ్రామపంచాయతీలో తీర్మానం లేకుండా అక్రమంగా మద్యం షాపు ప్రారంభించారు. గ్రామపంచాయతీలో అనేక అక్రమాలకు పాల్పడ్డాడని తెలిపారు. గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే మందుల షాపును దౌర్జన్యంగా మూసి వేయించాడని చెప్పారు. చింతకాని పోలీస్‌ స్టేషన్‌లో 2022 మే 20న ఉమ్మినేని రమేష్‌ పై క్రైమ్‌ నెంబర్‌ 47/21, మధిర టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2022లో మధిర క్రైమ్‌ నెంబర్‌ 32 /2022 కేసులు నమోదు అయ్యాయన తెలిపారు. ప్రొద్దుటూరు దగ్గర అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు ఆపినందుకు వారిపై తాగుడు బ్యాచ్‌తో తిరగబడితే నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు అయినట్లు తెలిపారు. అంతేకాకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నారని సమాచారం మేరకు చింతకాని పోలీసులు వెళ్ళగా వారిపై తిరగబడి తాగిన మైకంలో చిందులు వేస్తే చింతకాని పోలీసులు 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.
10 జులై 2023న ఉమ్మనేని రమేష్‌, గోవిందపురం ఎల్‌ గ్రామంలో అక్రమంగా మట్టి తోలకాలు చేస్తుండగా స్థానికులు సమాచారం మేరకు బోనకల్‌ ఎస్సై తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో ఉమ్మినేని రమేష్‌ పోలీసులపై తిరగబడ్డారు. 10 జూలై 2023న ఉమ్మినేని రమేష్‌పై బోనకల్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు అయినట్టు తెలిపారు. గాయత్రి మెడికల్‌ షాప్‌ పై దౌర్జన్యంగా మూసి వేయకపోతే నీ అంత చూస్తామని బెదిరించి మూసి వేయించాడని పేర్కొన్నారు. అక్రమంగా ఆవులను అర్ధరాత్రి ఎస్సీ కాలనీలో ప్రస్తుతం సర్పంచ్‌ రమేష్‌ తండ్రి ఉమ్మినేని బాబు దొంగతనంగా వాటిని తోలుకపోయి వైరా సంతలో అమ్ముతుండగా బాధిత రైతే పట్టుకున్నట్టు తెలిపారు. వైరా సంతలో ఆవులు అమ్ముతుండగా పొన్నం రామచందర్రావు, తాత వెంకయ్య వైరా సంతలో ఆవులు కొనేందుకు వెళ్లగా ఉమ్మనేని బాబు ఆవులను అమ్ముతుండగా పొన్నం రామచంద్రరావు, తాత వెంకయ్య గోవిందపురం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ ఆవులని గుర్తించి వారికి సమాచారం అందించడంతో వారు సంతకు వెళ్లేసరికి వారు వస్తున్న విషయం తెలుసుకుని ఉమ్మినేని బాబు అక్కడ నుంచి పారిపోయాడని తెలిపారు. సెల్‌ ఫోన్లు దొంగతనం కేసులో ఖమ్మం రూరల్‌ పోలీస స్టేషన్‌లో ఉమ్మనేని రమేష్‌ పై కేసు నమోదు అయిందని తెలిపారు. వాజేడు గ్రామపంచాయతీ పరిధిలో పడమటి తండాలో కొర్ని శ్రీను అనే వ్యక్తి ఇంట్లో చొరబడి ఉమ్మనేని రమేష్‌ సెల్‌ ఫోన్ల దొంగతనానికి పాల్పడ్డారని చెప్పారు. సెల్‌ ఫోన్‌ దొంగతనాలు వాటిని అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో తాగుడు, జలసాలు చేస్తూ గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. కళ్యాణపు వెంకటి ఇంటి తలుపులు పగలకొట్టాడని తెలిపారు. పెంట్యాల మల్లయ్య భార్యను మహిళ అనే జ్ఞానం లేకుండా రమేష్‌ తండ్రి బాబు చెప్పుతో కొట్టాడని తెలిపారు. ఎస్సీ స్మశాన వాటికలో నుండి అక్రమంగా దారులు తీసిన చరిత్ర గ్రామకంఠ భూములను కలుపుకున్న చరిత్ర వారికి ఉందని తెలిపారు. రమేష్‌ ఇంటి దగ్గర ఎవరో కారు పార్కింగ్‌ చేసుకుంటే సహించలేక రమేష్‌ కారు అద్దాలను పగలగొట్టాడని తెలిపారు. రమేష్‌ ఎస్సీ కాలనీలో అర్థరాత్రి 12 గంటల సమయంలో వెళితే కాలనీవాసులు రమేష్‌ని తరిమికొట్టారని తెలిపారు. ఉమ్మనేని రమేష్‌, ఉమ్మినేని బాబు గ్రామపంచాయతీలో చేసిన అవినీతి, గ్రామంలో చేసిన చేస్తున్న అరాచక, అవినీతి, అక్రమాలను గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వస్తే నిరూపిస్తామని సీపీఐ(ఎం) నాయకులు సవాల్‌ విసిరారు. తండ్రి కొడుకులు గ్రామంలో రౌడీల లాగా ప్రవర్తిస్తున్నారని, వీరి వలన గ్రామ ప్రజలు నిత్యం భయాందోళనతోనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

Spread the love