Friday, May 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

- Advertisement -

రిజర్వు చేసుకునే అవకాశం : ఎండీ వై.నాగిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
​ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ఆ సంస్థ వైస్ చైర్మెన్‌, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. గురువారం (మే 21వ తేదీ నుంచి) జూన్ ఒకటో తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేం దుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు వివరిం చారు. వారి ప్రయాణం సుర క్షితంగా, సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నట్ట ఆయన తెలిపారు.
​భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకు ని రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి కాళే శ్వరానికి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఎండీ స్పష్టం చేశారు. హైదరాబాద్, నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మంచిర్యాల వంటి ముఖ్య ప్రాంతాల నుంచి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందు బాటులో ఉంటాయన్నారు. ప్రయాణీకులు, భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక సంప్రదింపు నంబర్లను కూడా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు సమాచారం కోసం 9959226245 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు

అలాగే నర్సంపేట (9959226293), తొర్రూరు (9959226053), భూపాలపల్లి (9959226707), మణుగూరు (9959225963), కరీంనగర్ (9959225920), మంథని (9959225923), హన్మకొండ (9959226049), మహబూబాబాద్ (9959226054), జనగామ (9959226050), పరకాల (9959226051), నిజామాబాద్ (9959226016), గోదావరిఖని (9959225922), మంచిర్యాల (9959226004) నంబర్లలో సంప్రదించి బస్సుల వేళలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కొరకు టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు. భక్తులందరూ ఈ ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకోవడం ద్వారా సురక్షితమైన వాతావరణంలో కాళేశ్వర సరస్వతి పుష్కరాల యాత్రను విజయవంతం చేయాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -