పాలకంకులు పుస్తకం ఎంపిక..

నవతెలంగాణ -కంటేశ్వర్

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి నెలకొల్పిన ప్రతిష్టాత్మక సుశీలానారాయణరెడ్డి ట్రస్టు, వారి ముద్రణకు మాదస్త ప్రణవి రచించిన పాలకంకులు కవితా సంపుటి ఎంపికైందని ట్రస్టు కార్యదర్శి డా.జె.చెన్నయ్య తెలిపారు. ఈ  ట్రస్టు ప్రతిసంవత్సరం కొత్తకవయిత్రులను ప్రోత్సహించాలనే ఆశయం వారు రాసిన తొలిపుస్తకాలను ముద్రణకై ఆహ్వానిస్తారు. వచ్చిన వాటిని పరిశీలించి కమిటీ అందులో నుండి మంచికవితాసంపుటను ఎంపిక చేస్తారు. 2023 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 40 పుస్తకాల నుండి పదింటిని ఎంపికచేసారు. దీనిలో జిల్లా యువ కవయిత్రి మాదస్తప్రణవి రాసిన  పాలకంకులు  ఒకటి. ఈ పుస్తకం ముద్రణ ఖర్చులన్నీ ట్రస్టు భరించి, పుస్తకాన్ని సభలో ఆవిష్కరించి, కవయిత్రికి పుస్తకాలు అందజేస్తారు.పాలకంకులు పుస్తకం ఆవిష్కరణసభ ఈ నెల 27 న తెలంగాణ సారస్వతపరిషత్ లో రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా జరుగనున్నది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కే.వి.రమణాచారి, మేనేజింగ్ ట్రస్టీ సి.నా.రె. కుమార్తె గంగ,పత్తిపాక మోహన్  సాహితీవేత్తలు, పాల్గొంటారు. ఈ సందర్భంగా మాదస్త ప్రణవిని జిల్లా కవులు వి.పి.చందన్ రావు, పంచరెడ్డి లక్ష్మణ, ఘనపురం దేవేందర్, డా.కాసర్ల నరేశ్ రావు, డా.శారద, తిరుమల ఆర్య, డా.పింగళి, జనగామ చంద్రశేఖర శర్మ, సాయిప్రసాద్, రమణాచారి, అభినందించినారు.
Spread the love