పశ్చిమ దేశాల పరిశ్రమల నిష్క్రమణతో లాభపడుతున్న రష్యా!

Western countries

Russia is benefiting from the exit of industries!మాస్కో : అంతర్జాతీయ కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమిస్తుండగా ఏర్పడిన శూన్యంలో రష్యా వ్యాపారులు వేగంగా ప్రవేశిస్తున్నారు. పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీల ఆస్తులు అరకొర ధరలకు కైవశం చేసుకుని రష్యా కంపెనీలు లాభపడుతున్నా యని బ్లూమ్‌ బర్గ్‌ వార్తా సంస్థ ఒక కథనంలో రాసింది. అమెరికా ఫుడ్‌ కంపెనీ మెక్‌డోనాల్డ్‌, ప్యాకే జింగ్‌ గ్రూపు బాల్‌, కెమికల్స్‌ తయారీదారు హెన్కెల్‌ వంటి కంపెనీలు ఉక్రెయిన్‌ పైన రష్యా యుద్ధం ప్రకటించాక తమ వాటాదారుల నుంచి, ఆంక్షల రూపంలో అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో వత్తిడి వచ్చినందున రష్యానుంచి నిష్క్రమించాయి. 2022 -2023లో రష్యాలో పశ్చిమ దేశాల కంపెనీ లు 21 బిలియన్‌ డాలర్ల వ్యాపారాలను అమ్మటం జరిగిందని ఎకె అండ్‌ ఎమ్‌ వార్తాసంస్థ అంచనా వేసింది.
రష్యాకు చెందిన నూతన పెట్టుబడిదారులను గురించి బయటి దేశాల్లో పెద్దగా తెలియదు. వారు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ విధించిన ఆంక్షల లిస్టుల్లో లేరు. ఉదాహరణకు కాస్మొటిక్స్‌, గృహోపకరణాలను ఉత్పత్తిచేసే అలెక్సే సగల్‌కు చెందిన అర్నెస్టు గ్రూపు 2022 సెప్టెంబరులో బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమను 530మిలియన్‌ డాలర్లకు కొన్నది. ఆ తరువాత ఇదే గ్రూపు ప్రపంచ ప్రసిద్దిగాంచిన హైనెకిన్‌ బీర్‌ కంపెనీని ఈ సంవత్సరం ఆగస్టులో కొన్నది. రష్యాలో అత్యంత ధనవంతుడు వ్లదీమీర్‌ పొటానిన్‌ ఫ్రెంచ్‌ బ్యాంకింగ్‌ గ్రూపు సొసైటీ జనరల్‌కు చెందిన రోస్‌ బ్యాంకును గత సంవత్సరం కొన్నాడు. 2022 డిసెంబరులో అమెరికా, బ్రిటన్‌లు పొటానిన్‌ పైన వ్యక్తిగతమైన ఆంక్షలను విధించాయి.
రష్యన్‌ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచటానికి బహుళజాతి కంపెనీలు రష్యానుంచి నిష్క్రమించాయి. అయితే అలా నిష్క్రమించటాన్ని రష్యా కఠినతరం చేయటంతో వాస్తవంలో రష్యా పారిశ్రామికవేత్తలు బాగా లాభపడ్డారు. రష్యా నుంచి నిష్క్రమించాలంటే బహుళజాతి కంపెనీలు తమ ఆస్తులను 50శాతం తగ్గించి అమ్మాలి. అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. తమ ఆస్తుల మార్కెట్‌ విలువలో సగంపైన 10శాతం రష్యా ప్రభుత్వానికి చెల్లించాలి.

Spread the love