రైతు బాంధవుడు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్

Rythu Bandhudu is Chairman of Busireddy Foundation– ప్రజానాయకుడు పాండురంగారెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి  రాజవరం గ్రామ శివారులో మేజర్ కాలువ పూడికతీత పనులను బుధవారం సొంత ఖర్చులతో ప్రారంభించారు.ఈసందర్బంగా గ్రామస్టులు మాట్లాడుతూ  రైతులకు అండగా ఎల్లప్పుడూ సేవలందిస్తున్న ప్రజానాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.బుసిరెడ్డి పాండురంగా రెడ్డి పిలుపు మేరకు పూడికతీత పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, అనుముల కోటేష్, రాజవరం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love