రైల్‌ కాల్పుల ఘటనలో మరణించిన సైపుద్దీన్‌

– కుటుంబానికి కేటిఆర్‌ అండ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీలో హామీ ఇచ్చిన ప్రకారం, జూలై 31న జైపూర్‌-ముంబై రైలు ఘటనలో మరణించిన హైదరాబాద్‌ నివాసి సయ్యద్‌ సైఫుద్దీన్‌ కుటుంబానికి మంత్రి కేటీ రామారావు రామారావు అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. మరణించిన సైఫుద్దీన్‌ భార్య అంజుమ్‌ షాహీన్‌ను శనివారం అసెంబ్లీ ఆవరణలోని మంత్రి కార్యాలయంలో కలిసారు. తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. షాహీన్‌కు కులీ కుతుబ్‌ షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా నిమించిన ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. దీంతో పాటు ప్రభుత్వం డబుల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్‌ మంజూరు, కేటాయింపు పత్రాన్ని అందజేశారు. సైఫుద్దీన్‌ ముగ్గురు పిల్లలకు… ఒక్కొక్కరి కోసం రూ.రెండు లక్షల చొప్పున బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున అందించారు.

 

Spread the love