Salaar Review…సలార్‌ టాక్ ఎలా ఉందంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ : పాన్ ఇండియా ఇమేజ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిపోయాడు ప్రభాస్‌. బాహుబలి ప్రాంఛైజీ తర్వాత అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. మళ్లీ చాలా కాలానికి ప్రభాస్‌ ఫ్యాన్స్ ఆశిస్తున్న అన్ని ఎలిమెంట్స్‌తో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది యాక్షన్‌ థ్రిల్లర్‌ సలార్. సలార్‌ రెండు పార్టులుగా వస్తోండగా.. Salaar Part-1 Ceasefire నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. కేజీఎఫ్‌ ప్రాంఛైజీ లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌ బస్టర్ హిట్టందించిన ప్రశాంత్‌ నీల్‌ కాంపౌండ్ నుంచి వస్తుండటంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్‌ ఎలా ఉంది..? అభిమానుల అంచనాలను చేరుకుందా..? లేదా..? అనే దానిపై ఓ లుక్కేస్తే..
1995 బ్యాక్‌ డ్రాప్‌లో సాగే చిన్నారుల స్నేహం నేపథ్యంలో కథ మొదలవుతుంది. దేవా వాగ్దానంతో సాలార్ టైటిల్ కార్డు పడుతుంది. సూరేడే పాట వస్తుంది. ఆ తర్వాత శ్రియారెడ్డి తన గ్యాంగ్‌తో శృతిహాసన్‌ కోసం రావడంతో.. గూస్‌ బంప్స్ తెప్పించే ప్రభాస్‌ గ్రాండ్ ఎంట్రీ సీన్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ప్రభాస్‌ క్రేజ్‌తో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవడం పక్కా అని హ్యాష్‌ట్యాగ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అసోం కోల్‌ మైన్స్‌లో ప్రభాస్‌, శృతిహాసన్‌, ఈశ్వరీ రావ్‌ మధ్య వచ్చే సీన్లతో సాగుతుంది. భారీ ఫైట్‌ సీన్‌, ట్విస్టుల తర్వాత వరద పృథ్విరాజ్‌ ఇంట్రడక్షన్‌ ఉంటుంది. ఓ వైపు ప్రభాస్‌ వయోలెంట్ అవతార్‌.. మరోవైపు పృథ్విరాజ్‌ సుకుమారన్‌, ప్రభాస్‌ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయంటున్నారు మూవీ లవర్స్‌. ఇంటెన్స్ యాక్షన్‌ సీక్వెన్స్‌లో సూపర్ ఎలివేషన్‌తో సాగే ప్రభాస్‌ యాక్షన్‌ అవతార్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచిపోతుందంటున్నారు సినీ జనాలు. రెండు ఫైట్స్‌ సలార్‌ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలపడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో తన మేనియా కొనసాగుతుందని ట్రేడ్ సర్కిల్ సమాచారం. మరి బాక్సాఫీస్‌పై సలార్ దండయాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

Spread the love