అత్యవసర సేవల సిబ్బందికి సెల్యూట్‌

– మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవ ల సిబ్బందికి మంత్రి హరీష్‌రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేశారు. సహాయక చర్యల్లో నిమగమై ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారు చేస్తున్న సేవలు అమూల్యమన్నారు. సీఎం కేసీఆర్‌ నిరంతర పర్య వేక్షణలో విపత్తు నిర్వహణ, పోలీసు, మున్సిపల్‌, పంచా యతీ, అరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు అభినందనీయమని వివరించారు.

Spread the love