టీవీలలో ఇంటరాక్టివ్ యోగా అనుభవాన్ని గ్లోబల్ ఫస్ట్‌గా తీసుకోచ్చిన శామ్‌సంగ్

– శామ్‌సంగ్ టీవీలతో జత చేసిన యోగిఫై (YogiFi) స్మార్ట్ యోగా మ్యాట్‌ల ద్వారా రియల్-టైమ్ ఫీడ్‌బ్యాక్ పొందండి
– 2023 శామ్‌సంగ్ స్మార్ట్ టీవీల మోడళ్లు యోగిఫై (YogiFi) యాప్ ద్వారా యోగా కంటెంట్‌ను అందిస్తాయి.
నవతెలంగాణ- గురుగ్రామ్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్, ప్రపంచవ్యాప్తంగా తన టెలివిజన్‌ల ద్వారా తన వినియోగదారులకు ఇంటరాక్టివ్ యోగా అనుభవాన్ని అందిస్తోంది. హెల్త్-టెక్ స్టార్టప్, వెల్నెసిస్ టెక్నాలజీస్ అవార్డు గెలుచుకున్న ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి యోగిఫైతో తన ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా, శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ- ఎనేబుల్ చేయబడిన యోగా మ్యాట్‌ను జత చేయడం ద్వారా వినియోగదారులు ‘సాంకేతిక విధానం’లో యోగాభ్యాసం చేసేందుకు వీలు కల్పించాలని శామ్‌సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. భంగిమ సవరణకు సంబంధించి తక్షణ ఫీడ్‌బ్యాక్‌తో రిచ్ యోగా కంటెంట్‌ను సులభంగా అందుకునేలా చేయడం ఆధునిక వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యోగాభ్యాసంతో వారు తరచుగా నిశ్చల జీవనశైలిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. అధునాతన యోగి లేదా అనుభవం లేని వ్యక్తి అయినా, ప్రతి ఒక్కరూ శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలలో యోగిఫై (YogiFi) యాప్ ద్వారా గైడెడ్ క్లాస్‌లు, వ్యక్తిగతీకరించిన సెషన్‌లు, రియల్-టైమ్ ఫీడ్‌బ్యాక్ మరియు వెల్నెస్ మానిటరింగ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. యోగిఫై యాప్ నియో క్యూఎల్ఇడి 4K మరియు 8K టీవీలు, ఓఎల్ఇడి టీవీ మరియు క్రిస్టల్ 4K యుహెచ్‌డి టీవీ శ్రేణి వంటి అన్ని 2023లో శామ్‌సంగ్ విడుదల చేసిన స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంటుంది. దీన్ని త్వరలో గత ఏడాదులలో విడుదల చేసిన టీవీ మోడళ్లలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ‘‘శామ్‌సంగ్‌లో సంపూర్ణ ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ కోసం, వినియోగదారుల కోరుకుంటున్న అంశాలను మేము అర్థం చేసుకున్నాము. యోగాను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యోగిఫైతో మా భాగస్వామ్యం అనుసంధానం చేయబడిన ప్రపంచానికి ప్రశాంతతను తీసుకురావాలన్న మా దృష్టి కోణంలో ఒక భాగం. తద్వారా పరికరాలు మరియు ఆవిష్కరణలు మెరుగైన, మరింత వ్యక్తిగతమైన, మరింత స్పష్టమైన పలు పరికరాల అనుభవాలను ప్రారంభిస్తాయి. వినియోగదారులు ఇప్పుడు తమ ఇంటి వద్ద శామ్‌సంగడ్ టీవీల్లో యోగా ‘టెక్ వే’లో అభ్యాసం చేస్తూనే, తక్షణం లభించే ఫీడ్‌బ్యాక్‌తో ప్రయోజనం పొందవచ్చు’’ అని సామ్‌సంగ్‌లోని ఇండియా కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్ టీమ్ హెడ్ దీపేష్ షా అన్నారు. Samsung యొక్క మేక్ ఫర్ ఇండియా చొరవలో భాగంగా Samsung స్మార్ట్ టీవీలలో యాప్‌ను తీసుకురావడానికి SRI-Delhi (Samsung R&D Institute India-Delhi) YogiFiతో సన్నిహితంగా సహకరించింది. ‘‘యోగిఫైలో, శారీరక, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరి రోజువారీ జీవనశైలిలో ఏఐని ఉపయోగించి యోగాను ఏకీకృతం చేసే గ్లోబల్ మిషన్‌లో మేము ఉన్నాము. టెలివిజన్ విభాగంలో అగ్రగామిగా ఉన్న శామ్‌సంగ్‌తో భాగస్వామ్యం ద్వారా, ప్రతి వ్యక్తికి ఇంట్లో యోగా అనుభవాన్ని అందించాలని, బలమైన రోగనిరోధక శక్తితో ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించే మా లక్ష్యం ప్రభావాన్ని పెంచాలని మేము కోరుకుంటున్నాము’’ అని వెల్నెసిస్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు సీఈఓ మురళీధర్ సోమిశెట్టి తెలిపారు. యాప్‌లోని యోగా కంటెంట్ ల్యాండ్‌స్కేప్‌లో మూడు స్థాయిల 21-రోజుల ప్రోగ్రామ్‌లు ఉన్నాయి – బిగినర్స్, ఇంటర్మీడియట్ మరియు అడ్వాన్స్‌డ్ ద్వారా వినియోగదారులు సంపూర్ణమైన అనుభవాన్ని పొందేందుకు సంబంధిత యోగా ఆసనాలతో జాగ్రత్తగా రూపొందించారు. సెన్సార్‌లతో అమర్చబడిన, యోగిఫై నుంచి ఏఐ-ఎనేబుల్డ్ మ్యాట్ ఏదైనా తప్పుగా ఉన్న భంగిమను గుర్తించి, తక్షణ ఫీడ్‌బ్యాక్‌ను అందజేస్తుంది. వినియోగదారులను వారి అమరికను సరిదిద్దేందుకు, మెరుగుపరచేందుకు ఇది అనుమతిస్తుంది.
అనుకూలమైన శామ్‌సంగ్ టెలివిజన్‌లు: నియో క్యూఎల్ఇడి 8K మరియు 4K టీవీలు
అద్భుతమైన నియో క్యూఎల్ఇడి టీవీ శ్రేణి టెలివిజన్ కన్నా చాలా ఎక్కువగా ఉండేలా రూపొందించబడింది. ప్రిఫెక్ట్ వీక్షణ అనుభవాన్ని అందించడమే కాకుండా, ఈ టీవీలు మీ లీనమయ్యే గేమింగ్ స్క్రీన్‌గా, మీ ఇంటికి అందమైన కేంద్రంగా ఉండవచ్చు లేదా మీ ఇంటిలోని ఇతర పరికరాలను నియంత్రించే స్మార్ట్ హబ్‌గా కూడా ఉండవచ్చు. నియో క్యూఎల్ఇడి టీవీలు క్వాంటమ్ మినీ ఎల్ఇడిలకు ఆధారితమైన క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీతో వస్తాయి. ఇవి సాధారణ ఎల్ఇడిల కన్నా 40 రెట్లు చిన్నవిగా ఉంటాయి. తద్వారా చిత్రమైన స్పష్టత మరియు రంగు వాల్యూమ్‌ను అందిస్తాయి. ఈ టీవీలు అంతిమ 3డి సరౌండ్ సౌండ్ హోమ్ థియేటర్ అనుభవం కోసం క్యూ-సింఫనీ 3.0 మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్రో (ఓటీఎస్ ప్రో) ఫీచర్‌తో కూడిన డాల్బీ అట్మోస్‌కు కూడా మద్దతు ఇస్తాయి. టెలివిజన్‌లు అంతర్నిర్మిత ఐఓటి హబ్‌తో వస్తాయి. ఇది మీ అన్ని స్మార్ట్ పరికరాలను సజావుగా నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్లిమ్‌ఫిట్ కెమెరాతో, మీరు వీడియో కాల్స్ చేసునేందుకు మీ టీవీని ఉపయోగించవచ్చు.
క్రిస్టల్ 4K యుహెచ్‌డి టీవీలు
శామ్‌సంగ్ క్రిస్టల్ 4K ఐస్మార్ట్ యుహెచ్‌డి (iSmart UHD) టీవీలు విలక్షణమైన ఫీచర్లతో ప్రీమియం అనుభవానికి హామీ ఇస్తాయి. క్రిస్టల్ సాంకేతికతతో నడిచే, టీవీ సాటిలేని షార్ప్ మరియు కాంట్రాస్ట్ స్థాయిలతో రంగులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్రిస్టల్ 4K డిస్‌ప్లే, వీడియో కాలింగ్, స్మార్ట్ ఐఓటి హబ్, అడాప్టివ్ సౌండ్, ట్యాప్ వ్యూ, స్క్రీన్ మిర్రరింగ్ మరియు లాగ్ ఫ్రీ గేమింగ్ వంటి అనేక ఫీచర్లతో, ఈ టీవీలు వినియోగదారులకు మెరుగైన చిత్ర నాణ్యతను, అత్యుత్తమ కంటెంట్ వినియోగ సామర్థ్యాలను ఆస్వాదించేందుకు అనుమతిస్తాయి.
శామ్‌సంగ్ క్యూఎల్ఇడి టీవీలు
శామ్‌సంగ్ క్యూఎల్ఇడి టీవీ ప్రీమియం టెలివిజన్‌లు మరియు ఇంటిలో వినోదం కోసం కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యంత అధునాతన చిత్ర స్పష్టతతో కూడిన అందమైన డిజైన్‌ను అందిస్తుంది. క్వాంటం డాట్ టెక్నాలజీతో టెలివిజన్ బ్రైట్‌నెస్ స్థాయిలను ఆప్టిమైజ్ చేస్తుంది మరియు కంటెంట్ సృష్టికర్తలు ఉద్దేశించిన విధంగా ప్రకాశవంతమైన మరియు లోతైన రంగులను అందిస్తుంది. క్యూఎల్ఇడి టీవీలు ఇంట్లో అపూర్వమైన సినిమాటిక్ అనుభవం కోసం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ (OTS) మరియు యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ (AVA)ని కూడా కలిగి ఉంటాయి. మీరు వీడియో కాల్‌లు చేయడానికి స్లిమ్‌ఫిట్ కెమెరాను మీ క్యూఎల్ఇడి టీవీకి జోడించవచ్చు. మీ దృష్టిలో తేలికగా ఉంటుంది, ఇది ఐకంఫర్ట్ మోడ్‌తో వస్తుంది. ఇది అంతర్నిర్మిత సెన్సార్‌ల ఆధారంగా స్క్రీన్ ప్రకాశాన్ని మరియు టోన్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ‘100 శాతం కలర్ వాల్యూమ్’ని అందిస్తూ, క్యూఎల్ఇడి టీవీ విభిన్న స్థాయి ప్రకాశంతో సంబంధం లేకుండా డీసీఐ-పి3 కలర్ స్పేస్‌లోని అన్ని రంగులను ప్రదర్శిస్తుంది. హెచ్‌డిఆర్ చిత్రాలను కంటెంట్ ఉత్పత్తి చేసిన విధంగా చూడవచ్చని నిర్ధారిస్తుంది.
ఓఎల్ఇడి టీవీ
అద్భుతమైన ఓఎల్ఇడి (OLED) టీవీ అద్భుతమైన డిటెయిల్స్‌ను మరియు నమ్మశక్యం కాని స్క్రీన్ ప్రకాశాన్ని అందించే అంతిమ వినోద అనుభవం కోసం న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 4Kతో వస్తుంది. ఇది స్క్రీన్‌పై ప్రదర్శించబడే కంటెంట్‌ను అసలు స్థాయితో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా ఉత్కంఠభరితమైన షార్ప్ 4K రిజల్యూషన్‌కి మార్చేందుకు అనుమతిస్తుంది. ప్రాసెసర్ ఏఐ-ఆధారిత అల్గారిథమ్‌లను సీన్-బై-సీన్ ఆధారంగా కంటెంట్‌ను మూల్యాంకనం చేసుకునేందుకు ఉపయోగిస్తుంది మరియు హెచ్‌డిఆర్ ఓఎల్ఇడి+ ప్రతి ఫ్రేమ్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. దీనితో మీరు అసాధారణ డిటెయిల్స్‌ను ఆస్వాదించవచ్చు.

Spread the love