- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 14వ వార్డు ఎస్డీకాలనిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వార్డు సభ్యురాలు రాజేశ్వరి, స్థానికులు ఇందారపు రవి, డేవిడ్ రాజ్ బుధవారం గ్రామ సర్పంచ్ బండి స్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డులో రోడ్డుపై చెత్త చెదారం, డ్రైనేజీలో మురుగు నీరు నిండిపోయి రోడ్డుపై ప్రవహిస్తూ దుర్వాసన వేదజల్లుతొందని , డ్రైనేజీ శుభ్రం చేసి, శాశ్వత పరిస్కారం చేయాలని కోరారు.
- Advertisement -



