Thursday, April 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల టాపర్ ను సన్మానించిన సర్పంచ్ బండిస్వామి

మండల టాపర్ ను సన్మానించిన సర్పంచ్ బండిస్వామి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనభరిసిన కనబరిచి ప్రభంజనం సృష్టించారు. అయితే ఈ పాఠశాలలో చదివిన మేనం ప్రణతి 564 మార్కులు సాధించి మండల టాపర్ గా కాకుండా భూపాలపల్లి జిల్లాలో ఉన్న 64 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలో సైతం టాపర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో గురువారం గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ప్రణవిని అభినందించి, శాలువాతో ఘనంగా సత్కరించి, ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మేనం రాకేష్, లింగారావు, రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -