ఎస్‌బీఐ లైఫ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

నూతన కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్‌ : ప్రముఖ బీమా కంపెనీ ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ హైదరాబాద్‌లో తన నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇది తెలంగాణ, కర్నాటక, అమరావతిలలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించనుందని ఆ సంస్థ పేర్కొంది. సోమవారం నూతన కార్యాలయాన్ని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ కిషోర్‌ కుమార్‌ పోలుదాసు, ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ జింగ్రాన్‌, అమరావతి సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌ చంద్ర ఝా లాంచనంగా ప్రారంభించారు. దీని ద్వారా ఈ ప్రాంతాల్లో బీమా అవగాహనను మరింతగా పెంచడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు మద్దతును అందించనున్నామన్నారు.

Spread the love