శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో సైన్స్ ఫెర్

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న అతిథులు
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న అతిథులు

నవతెలంగాణ భీంగల్
పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో సైన్స్  ఫెర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమ్‌గల్, కామారెడ్డి ఉన్నత, ప్రాథమిక పాఠశాల, పోసాని పేట్, పిట్లం బాన్సువాడ, నిజామాబాద్ పట్టణాలలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని విజ్ఞానమేలాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి, కార్యదర్శి జి.నర్సయ్య , సరస్వతి విద్యాపీఠం ఇందూర్ విభాగ్ అధ్యక్షులు నాగరాజ్ శర్మ, కార్యదర్శి  రెడ్డి హరిస్మరన్ రెడ్డి,  రాజారెడ్డి, లక్ష్మీ నరసయ్య, పక్కి శ్రీనివాస్,  కృష్ణవేణి, సిరిగాధ శంకర్, బహుమతులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానాచార్యులు, ఆచార్యులు, మాతజిలు, మరియు విద్యార్థులు  పాల్గొన్నారు

Spread the love