
మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ శివారు ప్రాంతంలో సాగు అవుతున్న యాసంగి మినుము,పొద్దు తిరుగుడు,వేరుశెనగ,జొన్న తదితర పంటలను ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి , రేవంత్, శనివారం నాడు పరిశీలించారు. శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ శాఖ ఇంఛార్జి ఏడిఏ కిషన్, మద్నూర్ వ్యవసాయ అధికారి రాజు, వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతు సోదరులకు తగు సలహాలు సూచనలు అందించడం జరిగింది. ఈ పంటల పరిశీలన కార్యక్రమంలో రైతు సోదరులు బస్సెట్టి రాజు బి బసవరాజ్ ముద్దా వార్ ప్రకాష్ రాజు పటేల్ గంగాధర్ రాజు బద్రు సునీల్ మట్ట దేవురూ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. మినుము పంటలో ప్రధానంగా పూతలో మారుక మచ్చల పురుగు చోకిన వాటికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.