– కుండీలో నుంచి మునుగు నీరు తొలగిస్తున్న సిబ్బంది
– మండల వైద్యాధికారి డాక్టర్ మాసరాజు
నవతెలంగాణ – చండూరు
ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ బురదమయంతో పేర్కొని పోయాయి. సీజన్ వ్యాధులు ప్రబలి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎడతెరిపిల్లి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల రోడ్లపై నిలిచి ఉన్న కుంటలలో దోమలు, పందులు ైరవిహారం చేస్తున్నాయి. దీంతో దోమలతో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్, చికెన్ గున్యా బోదకాలు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కలుషిత నీటి వల్ల డయేరియా టైఫాయిడ్ ఫ్లూ వ్యాధులు సోకుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారం తొలగించాలని, పాత టైర్లు పగిలిన సీసాలో కుండలు పాత టైర్లు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వీలైతే వాటిని బయటపడే వేయాలని సూచిస్తున్నారు.
వైరల్ ఫీవర్ రావడానికి కారణాలు..
వైరల్ ఫీవర్ ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాసనాల ద్వారా కూడా వ్యాప్తిస్తుంది. కలుషిత నీరు ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్ ఫీవర్ విజృంభిస్తుంది.
లక్షణాలు..
వైరల్ ఫీవర్ తో బాధపడే వారిలో జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం, ఒంటిపై దద్దర్లు, వికారం,తలనొప్పి ఆకలి మందగించడం, గొంతు నొప్పి,ముక్కు రావడం,దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటిని,ఇంటి పరిసరాలను,ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి. వేడి వేడి ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లను తీసుకోవాలి. దోమలతరలను వాడాలి. కిటికీలకు తెరలను ఏర్పాటు చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్యని సంప్రదించాలి. బయట ఆహారం అసలు తీసుకోవద్దు. ముఖ్యంగా పానీ పూరి జంక్ ఫుడ్ అసలు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: మండల వైద్యాధికారి మాసరాజు
మన చుట్టూ ఉండే ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ప్రస్తుత వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాచి చల్లార్చిన నీటిని త్రాగడం ఉత్తమం. వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంట్లోకి ఈగలు, దోమలు, రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు దరిచేరవు. వర్షాకాలము లో నీటి నిలువఉండకుండా చూసుకోవాలి.