మరో 50 మంది బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణ
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో ఛార్జిషీట్ ను వచ్చే నెల 15లోగా కోర్టులో సమర్పించటానికి సిట్ అధికారులు సమాయత్తమవుతున్నారు. అదే సమయ ంలో ఈ కేసులో బాధితులైన మరో 50 మందిని అధికారులు దశలవారీగా పిలిచి, వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. గత కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను మరోసారి సిట్ అధికారులు పట్టాలెక్కించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులతోపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్.ఐ.బీ.చీఫ్‌గా పని చేసిన ఐపీఎస్ అధికారి ప్రభాకరరావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేయకుండా విచారించిన అధికారులు.. రెండో ఛార్జిషీట్ సందర్భంగా ఆయన పాత్రను సమగ్రంగా విచారించే అవకాశముంది. సంబంధిత ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ సేకరించింది. కాగా మిగతా బాధితులను ఒక్కొక్కరిని పిలిచి విచారించే ప్రక్రియను కూడా సిట్ చీఫ్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మొదలుపెట్టారు. కాగా రెండోఛార్జిషీట్ వేసే సమయానికి వీరందర్నీ విచారించి, వాంగ్మూలం సేకరించటమేగాక వాటికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించటానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
మే 15లోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో చార్జిషీట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



