అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి

– ప్రభుత్వచీఫ్‌విప్‌ దాస్యం వినరుభాస్కర్‌
నవతెలంగాణ-హనుమకొండ
గతంలో పాలించిన ప్రభుత్వాలకన్నా ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి రాబోయే ఎన్నికలలో మరోసారి ఆశీర్వ దించి తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్థించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినరు భాస్కర్‌ అన్నారు. హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్‌నేరెళ్ల వేణుమాధవ్‌ కళా ప్రాం గణంలో బుధవారం వాకర్స్‌ ఇంటర్నేషనల్‌, పబ్లిక్‌ గార్డెన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి న తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివద్ధి చెందిందని, దానిని ప్రజలు గుర్తించి రాబోయేఎన్నికల్లో మరొకసారి అవకాశం కల్పించి ఆశీర్వ దించాలని కోరారు. పబ్లిక్‌ గార్డెన్‌లోని పలు సమస్యల పట్ల అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు చల్లా లింగారెడ్డి, అధ్యక్షులు తక్కల్లపల్లి శ్రీనివాస్‌ కమిటీ అభ్యర్థన మేర కు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీఇచ్చారు. మొదటగా జ్యోతి ప్రజ్వ లన చేసిన అనంతరం నూతన కమిటీని పూల దండలు, శాలువాలతో ఘ నంగా సత్కరించారు. దాస్యం అభినవ్‌భాస్కర్‌ మాట్లాడుతూ గార్డెన్‌ లోని సమస్యల పట్ల అసోసియేషన్‌ వారు తమకు తెలియపరిస్తే పరిష్కరించేందుకు కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు తడక కుమారస్వామి, సారంగపాణి, ఎల్లగౌడ్‌, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, భారతి, గిరిజ, అన్నపూర్ణ, మా జీ అధ్యక్షులు జాన్‌ మొహమ్మద్‌, దేవానంద్‌, కమిటీ సభ్యులు విజరు కుమార్‌, కు మారస్వామి, గాంధీ, చంద్రమౌళి, జ్యోతి, రవికుమార్‌, సురేష్‌, రవి, వీణ, విజరు, హరి, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love