సంక్షేమ పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత : పెద్ది

నవతెలంగాణ-నర్సంపేట
సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాల్లో మహిళలకు అధిక ప్రాధన్యనిస్తూ హక్కులను గౌరవిస్తు న్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో 74 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి పథకం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మహిళ సంక్షేమ పథకాలతో సాధికారిత సాధనకు కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలకు రక్షణ క ల్పించడంతోపాటు వారి హక్కలను కాపాడిన ప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ పథకా లను అమలు చేసి పేద, సామాన్య ప్రజా నీకానికి అండగా నిలుస్తున్నాడన్నారు. ప్రత్యే కించి కళ్యాణలక్ష్మి పథకంతో పెండ్లీ కూతురు తల్లిని లబ్దిదారురాలిగా రూ.1,0116 కానుక గా అందిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశా లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సీ.శ్రీనివాసులు, నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి ఎంపీపీలు మోతె కలమ్మ, వేములపల్లి ప్రకాశ్‌రావు, ఊడ్గుల సునిత ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్రాంనర్సయ్య, నామాల సత్యనారాయణ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love