వామపక్ష బహుజనులు ఐక్యం కావాలి

– ఎంసీపీఐ (యు) వరంగల్‌ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్‌
నవతెలంగాణ-మట్టెవాడ
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా స్వాతం త్య్ర ఉద్యమంతో సంబంధంలేని, పుట్టగొడుగుల పు ట్టుకొచ్చిన అనేకబూర్జువాపార్టీలు తప్పుడు వాగ్దానాల తో అధికారంలోకి వస్తుంటే, ప్రజల కోసం అనేక త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టు పార్టీలు రోజురోజుకు క్షీణించేపరిస్థితికి రావడం కమ్యూనిస్టు ల తప్పిదమని ఎంసీపీఐ(యు) వరంగల్‌ జిల్లా కార్య దర్శి పెద్దారపు రమేష్‌ అన్నారు. ఎంసీపీఐ (యు) వ రంగల్‌ నగర కమిటి సమావేశం కామ్రేడ్‌ ఐతం నాగే ష్‌ అధ్యక్షతన స్థానిక అండర్‌ బ్రిడ్జి ఓంకార్‌ భవన్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రజలకు ద్రో హం చేసిన బూర్జువా దోపిడీ పాలక వర్గ పార్టీలతో ఒకటి, రెండుసీట్ల కోసం, పొత్తుల కోసం వెంపర్లాడ టంతో కమ్యూనిస్టు ఉద్యమం అంటే బూర్జువాల కొ మ్ముకాసే ఉద్యమంగా దిగజారిపోయిందని ఈ విధా నానికి ముగింపుపలికి సరైన గుణపాఠం నేర్చుకోవా ల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టు వామపక్ష బహుజన శక్తులు ఒక ఫ్రంట్‌గా ఏర్పడి సెక్యులర్‌ ప్రజాస్వామిక శక్తులనుకలుపుకుని శాసనసభ, పార్ల మెంటు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఇది ఎన్నికల కోసమేకాకుండా ఎన్నికల అనంతరం ప్రజా సమస్య లపై పోరాడుటకు పోరాట వేదికగా ఈ సంఘటన ప ని చేయాలన్నారు. ఆ దశ లో ఎంసీపీఐ(యూ) కృషి చేస్తుందని దీనికి సీపీఐ, సీ పీఎంపార్టీలు, అన్ని బహు జన వామపక్ష శక్తులు కలిసి రావాలని పిలుపుని చ్చారు నూతన ఆర్ధిక వి ధానాలు, నూతన పారిశ్రా మిక విధానాలు, కార్పొరేట్‌ సంపన్న వర్గాల ప్రయో జనంకోసం పనిచేసే పార్టీలకు వ్యతిరేకంగా నిఖార్సయిన లక్ష్యంతో పని చేయాలని ఆ విధంగా ప్రజల్లో విశ్వాసం కగిలిగించ టం ద్వారా ప్రజాప్రత్యామ్నా యంను నిర్మించటం ద్వారా ఈ దేశ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ఆ వైపు సరైన నిర్మాణం, నిర్ణయాలు చేయడానికి ఎంసపీఐ(యు) రాష్ట్రప్లీనరీ సమావేశాలు జూన్‌4,5,6 తేదీల్లో నర్సంపేట వాసవి కల్యాణ మండపంలో జరుగుతున్న సందర్భంగా జూ న్‌ 4న సాయంత్రం 4 గంటలకు నర్సంపేటలో ప్రద ర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు కేరళ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే కేకే రేమ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ మద్దికాయల అశోక్‌ఓంకార్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు కాటం నాగభూషణం, గాధగోని రవి, పోలిట్‌ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్‌ రెడ్డి, ఏఐఎఫ్‌డీడబ్ల్యూ జాతీయ కార్యదర్శి అనీష్‌జార్జ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంసీపీఐ (యు) వరంగల్‌ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్‌, నగర కార్యద ర్శి సుంచు జగదీశ్వర్‌, నగర నాయకులు ఎగ్గెని మల్లి కార్జున్‌, గోరంటాల శరత్‌ బాబు, రాయినేని ఐలయ్య, జడబోయిన నరసయ్య, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love