రేపు రాజేంద్రనగర్‌లో విత్తన మేళా

– పరిశోధన సంచాలకులు డాక్టర్‌ రఘురామిరెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో శుక్రవారం రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ ఆడిటోరి యంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నట్లు పరిశో ధన సంచాలకులు డాక్టర్‌ రఘురామిరెడ్డి తెలిపా రు. ఈ మేళాలో వ్యవసాయ విశ్వవిద్యాల యంతో పాటు రాజేంద్రనగర్‌ పరిధిలోని భారతీయ వ్యవ సాయ పరిశోధనా మండలి సంస్థలు ××ఉ=, ××వీ=, ××==, ఉద్యాన, పశు వైద్య విశ్వవి ద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శా ఖలు పాల్గొంటున్నాయన్నారు. అదేరోజున విశ్వవి ద్యాలయ పరిధిలోని మూడు ప్రాంతీయ వ్యవసా య పరిశోధనా స్థానాలు, (జగిత్యాల, పాలెం, వరంగల్‌), వ్యవసాయ పరిశోధనా స్థానాలు అలాగే విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా విత్తన మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగ ణంలో ఈ విత్తనమేళ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూపొందించిన జీవన ఎరువులు, చీడపీడల నివారణలో వాడే పరాన్న జీవులు మొదలైనవి రైతుల కొనుగోలు ని మిత్తం అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే విత్తనమేళాల్లో 16 పంటలలో 67 రకాలకు సంబంధించి దాదాపు 12 వేల క్వింటాళ్ళ విత్తనా లను రైతులు కొనుక్కోవడానికి అందుబాటులో పెడుతామని వివరించారు. ఈ సీడ్‌ మేళాలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్ఠి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించటానికి వీలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలతో కూడిన వ్యవ సాయ ప్రదర్శన కూడా అదేరోజున నిర్వహిస్తు న్నారు. రైతు సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొని ఈ విత్తన మేళా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ విత్తన మేళాలో వ్యవసాయ విశ్వవి ద్యాలయంలో రూపొందించిన వివిధ వంగడాలు అనగా వరిలో సన్నగింజ రకాలు (19 రకాలు) బీపీటీ 5204, డబ్ల్యుజీఎల్‌-44, డబ్ల్యు, జీఎల్‌-962, డబ్ల్యుజీఎల్‌ 1119, డబ్ల్యుజీఎల్‌ 1246, డబ్ల్యుజీఎల్‌ 1487, ఆర్‌డీఆర్‌ 1162, ఆర్‌డీఆర్‌ 1200, కేఎన్‌ఎమ్‌ 1638, కేపీఎస్‌ 6251, జేజీఎల్‌-28545, జేజీఎల్‌ 27356, జేజీఎల్‌ 33124, ఆర్‌ఎన్‌ఆర్‌. 15435, ఆర్‌ఎన్‌ఆర్‌-2465, ఆర్‌ఎన్‌ఆర్‌-11718, ఆర్‌ఎన్‌ఆర్‌. 21278, ఆర్‌ఎన్‌ఆర్‌. 29325, ఆర్‌ఎన్‌ఆర్‌. 15048 దొడ్డు గింజ రకాలు (8 రకాలు), ఆర్‌ఎన్‌ ఆర్‌ 28361, ఆర్‌ఎన్‌ఆర్‌. 15459, కేఎన్‌ఎమ్‌ 118, ఎంటీయూ 1010, డబ్ల్యుజీఎల్‌-915, జేజీఎల్‌ 24423, జేజీఎల్‌ 28639, సువాసన కలిగిన రకం (1) ఆర్‌ఎన్‌ఆర్‌-2465, మొక్క జొన్నలో (5హైబ్రిడ్స్‌) డీహెచ్‌యం 117, డీహెచ్‌యం 121, బీపీసీహెచ్‌. 6, కరీంనగర్‌ మక్క, కరీంనగర్‌ మక్క-1, జొన్నలో (2రకాలు) పీవైపీఎస్‌-2, సీఎస్‌వీ-41, రాగిలో (1) పీఆర్‌ఎస్‌ 38, ఆముదంలో (1రకం) పీసీహెచ్‌. 111, నువ్వులు (1రకం) జేజీయస్‌-1020, వేరుశనగలో (1రకం) ధరణి విత్తనాలను అందు బాటులో వుంచడం జరుగుతుంది అన్నారు. అపరాల పంటలైన పెసరలో (4 రకాలు) డబ్ల్యు జిజి 42, ఎమ్‌జిజి 295, ఎమ్‌జిజి 347, ఎమ్‌జిజి 385, మినుములో (1రకం) యంబీజీ 1070, కందిలో (8రకాలు) హనుమ, డబ్ల్యుఆర్‌. జీఈ-97, డబ్ల్యుఆర్‌ జీఈ-93, డబ్ల్యుఆర్‌ జీఈ-121, డబ్ల్యుఆర్‌జీఈ-255, పీఆర్‌జీ-176, టీడీఆర్‌జి-59, ఆశ సోయాచిక్కుడులో (4 రకాలు) బాసర, కెడిఎస్‌-726, ఎంఎయుయస్‌-612, ఎఐఎస్‌బి -50 పశుగ్రాస పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

Spread the love