లింగంపల్లి వద్ద 50 కిలోల గంజాయి పట్టివేత…

– నాంపల్లి రైల్వే ఇన్ స్పెక్టర్ ఏ శ్రీనివాస్
నవతెలంగాణ- సుల్తాన్ బజార్
నాంపల్లి ప్రభుత్వ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వ హించారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద 50 కిలోల గంజాయి పట్టుకున్నామని  రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఏ.శ్రీనివాస్ తెలిపారు. శనివారం నాంపల్లి ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షేక్ సలీమా ఐపీఎస్ ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో రైలను తనిఖీ చేసామని, లింగంపల్లి వద్ద భువనేశ్వర్ టు ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు భోగి నెంబర్ S7 కోచ్ లో తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి  అనుమాదాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేసాం అన్నారు. ఆ వ్యక్తి దగ్గర రెండు సూట్ కేసుల్లో 50 కిలోల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని అరెస్ట్ చేసి. శనివారం నిందితున్ని రైల్వే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love