
– ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన తాండ్ర నక్షత్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కళాశాలలో బైపైసీ లో మొదటి ఫేస్ లోనే సీట్ సాధించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్కా భాస్కర్ రావు శుక్రవారం ఓం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నీట్ (ఎంబిబియస్) & ఐఐటి (ఇంజనీరింగ్) మొదలగు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని,తద్వారా భవిష్యత్ లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సిటు సాధించిన నక్షత్ర ను ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రావు, ఉపాద్యాయులతోపాటు పలువురు అభినందించారు.అలాగే తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.ఇటీవల విడుదలైన పదోవతరగతి వార్షిక ఫలితాలలో తాండ్ర నక్షత్ర 9.5 జి.పి.ఎ.సాధించి పాఠశాలతోపాటు మండల టాపర్ గా నిలవడం మరో విశేషం. ప్రయివేటు విద్యా సంస్థలకు మేట్ గా, ధీట్ గా నడవబడుతున్న తాడిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024 యస్.యస్.సి వార్షిక ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు నక్షత్ర మండల టాపర్ గా నిలువడంపై ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులలో పాటు ఉపాధ్యాయులు తిరుపతి, కుమారస్వామి, సత్యనారాయణ, జయభాస్కర్, జగన్ నాయక్, శివలింగం, శ్రీనివాస్ వర్ణలత, సవిత, మహేష్, వినోద్ కుమార్ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.