కేంద్ర స్కాలర్ షిప్ కు తాడిచెర్ల విద్యార్థి ఎంపిక

– అభినందించిన పలువురు
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులను  జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తోంది.ఈ క్రమంలో నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కిం (ఎన్ఎంఎంఎస్) కోసం గత డిసెంబర్ నెలలో  నిర్వహించిన పరీక్షల్లో మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన మేనం ప్రణవి తను సత్తా చాటి కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్ షిప్ కు అర్హత సాదించింది.ఇందుకు ఆమెను తాడిచెర్ల హైస్కూల్ హెడ్ మాస్టర్ మల్కా భాస్కర్ రావుతోపాటు  పలువురు అభినందించారు.ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడారు  ప్రణవి తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో  8వ తరగతి చదువుతున్నట్లుగా తెలిపారు.గత డిసెంబర్ నెలలో జరిగిన ఈ పోటీ పరీక్షలో భూపాలపల్లి జిల్లా నుంచి 25 మంది విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైనట్లుగా,అందులో భాగంగానే ప్రణవి ఎంపికైయిందన్నారు.ఎంపికైన  విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగు సంవత్సరాలపాటు స్కాలర్ షిప్ వస్తుందన్నారు.
Spread the love