మండలంలోని ఆలేరు జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంగోతు రాందాస్ తెలిపాడు శనివారం విద్యార్థులే ఉపాధ్యాయు ఒక్కరోజు పాఠాలు తోటి విద్యార్థులకు బోధించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా ఒకరోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయులుగా భానోతు సింధు ప్రియా డిఇఓగా నిమ్మల లోకేష్ ఎం ఈ ఓ గా వర్షిని ఉపాధ్యాయులుగా అక్షయ అనూష శ్రావణి భవాని పూజిత స్పందన స్వాతి రాధిక ఉదయ్ కుమార్ విక్రమ్ లోకేష్ ఈశ్వర్ గా శ్రీధర్ సురేష్ విహరించారు నూతన ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ అన్ని వృత్తులలో కెల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని మేము ఒకరోజు తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం ఎంతో కష్టమనిపించింది అని అన్నారు కానీ మాకు పాఠాలు బోధించే గురువులు ఎంత కష్టపడి ఒకరోజు ముందుగానే వారు ప్రిపేర్ మాకు పాఠాలు అర్థమయ్యే రీతిగా బోధించిన గురువులకు రుణపడి ఉంటామని అన్నారు.అనంతరం స్కూల్ హెచ్ఎం ఆంగోతు రామ్ దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోధనలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహక ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది అన్నారు.క్రమశిక్షణతో చదివి నైతిక విలువలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.టీచర్స్ గా వ్యవహరించిన బాలబాలికలు మాట్లాడుతూ బోధించడానికి ముందు ప్రిపేర్ అవసరమని గుర్తించినట్లు తెలిపారు. .కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.క్షపతి, కె.బిక్షపతి, నరసయ్య, జయప్రకాష్ జబ్బార్,మోహన్ బాబు,స్రవంతి, మహేశ్వరి, అనితాదేవి,పీఈటి కిషన్ తదితరులు పాల్గొన్నారు.