సీపీఎం అభ్యర్థిని అసెంబ్లీకి పంపించండి

నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు ను అసెంబ్లీకి పంపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల కోరారు. మంగళవారం పట్టణంలోని వీటి కాలనీలో సీపీఎం అభ్యర్థి వెంకులు ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవకాశవాద పార్టీలు డబ్బు సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు వస్తున్నాయన్నారు. ఆ పార్టీలను పాతరేసి సీపీఎం అభ్యర్థికి అండగా ఉండాలన్నారు. సీపీఎం ఎమ్మెల్యే లేని అసెంబ్లీ పూజారి లేని దేవాలయం లాంటిది అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఎం అభ్యర్థులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు అభ్యర్థులు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకగా ఉన్న సీపీఎం పార్టీ అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, నాయకులు, చెన్నబోయిన నాగమణి, ఒంటెపాక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love