Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో ఏరులై పారుతున్న మురుగు నీరు 

పట్టణంలో ఏరులై పారుతున్న మురుగు నీరు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లు మురికి నీటి కాలువలుగా మారుతున్నాయి. భీంగల్ పట్టణంలోని పలు శివారు ప్రాంతాల్లో నంది గుడి, పురానిపేట్ వెళ్లే మార్గం విద్యానగర్ లో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్ల నుంచి వచ్చే మురికినీరు, అలాగే వర్షం నీరు రోడ్లపైనే నిలబడుతూ రోడ్లు గుంతలమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నది. దీనికితోడు సిమెంటు రోడ్లు ఉన్న వీధుల్లో చాలావరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని పరిస్థితి ఉంది. ఫలితంగా మురికి నీరు, వర్షం నీరు డాంబర్ రోడ్లపైనే నిలబడి ఉంటోంది. దీంతో బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. భీంగల్ నుండి ఆర్మూర్, అటు సిరికొండ రోడ్డు సమీపంలో సరైన డ్రైనేజీ వ్యవస్థలేక మురికి నీరంతా సిమెంటు రోడ్డుపైనే నిలబడుతున్నదని, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధిలల్లో సిమెంటు రోడ్లపై మురికినీరు నిలబడడం వలన పాచిపట్టి దానిపై నడిచే సందర్భంలో జారి కిందపడి గాయాలపాలవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -