Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హమాలీ కార్మికులకు మజ్జిగ పంపిణీ

హమాలీ కార్మికులకు మజ్జిగ పంపిణీ

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేర్ రూరల్ 
ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో పి ఏ సి ఎస్ నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుల కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిదే సంతోష్  ప్రారంభించగా.. గ్రామ సర్పంచ్ పరిదే మమత  ఆధ్వర్యంలో జరిగింది. ఎండ తీవ్రతలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేయడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చిన్నం శివకుమార్, ఇంచార్జి మద్దెల సాయికుమార్, రైతులు గవ్వల మల్లయ్య, గవ్వల సాయి మల్లయ్య, హమాలీ కార్మికులు మేకల రాములు, మేకల శ్రీనివాస్, బండ సిద్దులు, బండ మల్లేష్, ఉప్పలి నర్సింహులు, వస్పరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -