Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఎమ్మెల్యేను కలిసిన పట్టణ రైతు ప్రతినిధులు 

 ఎమ్మెల్యేను కలిసిన పట్టణ రైతు ప్రతినిధులు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
గత కొన్ని రోజులుగా పట్టణంలో దొడ్డ వడ్లను ఎండలో ఆరబోసి చాలా రోజులవుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని మున్నూరు కాపు సంఘము అధ్యక్షులు కలిగొట గంగాధర్ ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  సంబందిత అధికారులతో మాట్లాడి తక్షణమే కొనుగోలు చెయ్యాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టకూడదని, వాతావరణంలో మార్పులు వస్తే రైతులు చాలా నష్ట పోతారని అధికారులకు చెప్పారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు కొనుగోలు సెంటర్ లకు ఆదేశాలు ఇవ్వడం అభినందనీయం అని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రభుత్వ అధికారులకు, రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో  రైతు ప్రతినిధులు కలిగొట గంగాధర్, బొల్లు పోతన్న, నరడి మల్లయ్య & రైతులు చిట్టీ భజన్న, సిదపురం చిన్నయ్య, రాజేశ్వర్, రాజేందర్, తోట రాజేశ్వర్, గుండు చిన్నయ్య, రాజ్ కుమార్, నర్సయ్య, తోట నారాయణ, మల్లయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -