ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి

– ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
నవతెలంగాణ-నిజామాబాద్‌ రూరల్‌
13 ఏండ్ల బాలికపై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్పడిన లైంగికదాడి ఘటన మరవకముందే.. మరో ఇద్దరు మైనర్లపై లైంగికదాడి జరిగిన ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఓ ఘటనలో పదేండ్ల బాలికపై మైనర్‌ అబ్బాయి లైంగికదాడికి పాల్పడగా.. మరో ఘటనలో 16 ఏండ్ల అమ్మాయిపై 21 ఏండ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలు నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూశాయి. రూరల్‌ మండలంలోని మారుమూల గ్రామంలో పదేండ్ల బాలికపై 16 ఏండ్ల మైనర్‌ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని మైనర్‌ బాలుడు భయపెట్టినట్టు తెలిసింది. పది రోజులుగా మానసికంగా కృంగిపోయిన బాలిక గురువారం ఆమెకు జరిగిన దారుణాన్ని వాళ్ల మేనమామ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో బాలిక తల్లి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, బాలిక తండ్రి పొట్టకూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లాడు.ప్రస్తుతం అబ్బాయి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మరో ఘటనలో ముబారక్‌నగర్‌లోని 16 ఏండ్ల అమ్మాయిపై 21 ఏండ్ల యువకుడు లైంగిక దాడి ఘటన.. అమ్మాయి గర్భందాల్చడంతో రహస్యంగా అబార్షన్‌ చేయించినట్టు తెలిసింది.

Spread the love