మంజీరకు కొత్త నీరు

నవతెలంగాణ-బోధన్‌
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి నిజామాబాద్‌ జిల్లా సాలూర వద్ద మంజీర నదికి కొత్త నీరు వచ్చి చేరుతుంది. స్వల్పంగా నీరు చేరడంతో వర్షపునీటితో మంజీరా కళకళలాడుతుంది. మంజీరలో నీరు చేరడంతో సాలూర ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీటికి ఇబ్బందులు తొలగినట్లయింది. అంతేకాక, పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండటంతో వరి నాట్లు ఊపందుకున్నాయి.

Spread the love