రాష్ట్రంలో ఫీజురీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం 6 సంవత్సరాల నుండి 7,200 కోట్లు రూపాయలు వసూళ్లు చేయలేదు. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ విడుదల చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కోర్సులు పూర్తిచేసి ,ప్రవేశ పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించే సమయం వస్తోంది విద్యార్థులు ఒక కళాశాల నుండి మరోక కోర్సులోకి వెళ్ళాలంటే సర్టిఫికేట్ వారి స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ రాలేదని తమ దగ్గర పెట్టుకుని వేధింపులు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఫీజులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. గత అనేక సంవత్సరాలు నుంచి పేద విద్యార్థులు ప్రధానంగా అణాగారిన వర్గాలు విద్యార్థులు ప్రభుత్వం నుండి ఉపకార వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఈ ప్రభుత్వం అయినా ఫీజులు అన్ని బకాయిలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలలు, ఫీజు రీయింబర్స్మెంట్ పై మాత్రమే ఆధారపడి నడుస్తున్న కళాశాలలో కోట్లు రూపాయలు బకాయిలు వల్లన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం కూడా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని రాష్ట్రంలో బకాయిలు ఉన్న ఫీజులను తక్షణమే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ భవిష్యత్ లో ఫీజుల కోసం పోరాడుతుందని తెలిపారు.

Spread the love