
నవతెలంగాణ- కంటేశ్వర్: నిజాంబాద్ లోని ఉంటున్నటువంటి ఆరెకటికలకు ఇంత అన్యాయమా అని ఆత్మీయ సమ్మేళనం లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ పట్టణంలోని కసభ్ గల్లి లోని ఆరేకటిక సంఘంలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ ఆరెకటికలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఎన్నికల్లో వారి మద్దతు కోరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అరెకటికలు 20 లక్షల మంది ఉంటారు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిమ్మలిని ఓటు బ్యాంకుగా వాడుకొని పార్టీ కార్యకర్తలుగానే చూస్తూ, అవసరానికి వాడుకునే బానిసలుగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఐక్య మతంగ ఒకటిగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి నట్లయితే మీ సమస్యలన్నీ తోక ముడుచుకుని పోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరెకటిక వర్గాలు రాజ్యాధికారంలో వాటా, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకై ఎప్పటి నుంచో మీరు పోరాడుతున్న మీ కళను సాకారం చేసుకోవచ్చు.ఇప్పటికే ఆరికటికల విద్య కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హస్టల్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. అలాగే యాటలు మండీల నుంచి తెచ్చే సమయంలో ప్రమాదానికి గురైతే వాటికి నష్టపరిహారం అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. మీరుఇప్పటికే హక్కుల కోసం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఎన్నో చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మీ జనాభా ఎంతో అధికారికంగా బహిర్గతం చేయలేదు.చదువు కోసం సామాజిక న్యాయం కోసం అరెకటికల వర్గాల ఆత్మగౌరవం కోసం తలపెట్టిన బస్సు యాత్ర, అసెంబ్లీ ముట్టడి, ధర్నాలు చేయడంతో పాటు సరూర్‌నగర్‌లో రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టి ప్రభుత్వం ముందు ఎన్నో డిమాండ్లు చేసిన వాటికి న్యాయం జరగ లేదు. ప్రభుత్వంలో ఆరెకటిక ప్రజలకు రాజ్యాంగ ఫలాలు దక్కాలంటే వారికి విద్యా, వైద్యం ఆర్థికంగా వెనుకబడిన మధ్యతరగతి పేద కుటుంబాలకు అన్ని అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.