రామగిరి మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎండి షాహీద్..

నవతెలంగాణ- రామాగిరి: మంథని శాసన సభ్యులు శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా చందనాపూర్ గ్రామానికి చెందిన ఎండి. షాహీద్ ను నియమించినట్లు రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శివ తెలిపారు.ఈ మేరకు సెంటినరి కాలనీ లోని ఐఎన్ టియుసి శ్రీపాద భవన్ లో మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ సమక్షంలో  నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా షాహిద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,యువ నేత శ్రీను బాబుకు,  ధన్యవాదాలు తెలుపుతూ, తన నియామకానికి కృషి చేసిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాటం సత్యం, సీనియర్ నాయకుడు మహేశ్వర రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కొప్పుల గణపతి, మహిళా  అధ్యక్షురాలు  పబ్బతి రాధారెడ్డి, రామగిరి మండల మహిళ ఉపాధ్యక్షురాలు జాగారి రజిత,బిసి సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, కాంగ్రెస్ ఎస్ సి సెల్ అధ్యక్షుడు మంథని రవీందర్, మాజీ ఎస్ సి సెల్ అధ్యక్షుడు  కండె పోశం, నాగెపల్లి మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు రామయ్య పల్లె  ఉప సర్పంచ్ మొగిలి నరేష్ యాదవ్ కు తదితర నాయకులకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నన్నారు .
Spread the love