
– అభివృద్ధి పనుల కోసం ప్రతి డివిజన్ కి టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా 1 కోటి కేటాయింపు
– నిజామాబాద్ అభివృద్ధి మంత్రి కేటీఆర్ కితాబు
– అదనంగా ప్రతి డివిజన్ కి 1 కోటి రూ. మంజూరు చేసిన మంత్రి కేటీఆర్
– అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరం పలు అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు.36వ డివిజన్ బ్రిలియంట్ స్కూల్ దగ్గర లో 1 కోటి రూ.లతో నిర్మిస్తున్న రోడ్లు డ్రైనేజి పనులను ప్రారంభించారు. 37వ డివిజన్ అంబేద్కర్ కాలనీ లో 1 కోటి రూ. లతో నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రైనేజి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగల మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మౌలిక సదుపాయాల కు పెద్ద పీట వేస్తూ ప్రతి డివిజన్ లో రోడ్లు మరియు మురుగు కాలువలు నిర్మించాము. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందిస్తున్నాము.చివరి మజిలీ ఘనంగా సాగేందుకు స్మశాన వాటిక అనే భయం లేకుండా ఆధునిక సదుపాయాలతో వైకుంఠదామాలు నిర్మించాము. ప్రభుత్వ స్థలాలలో పార్కులు నిర్మించి ప్రజలకు అందుబాటులో కి తెచ్చాము.అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసాము.యువతకు యుజ్వల భవిషత్తు అందించేందుకు ఐటి హాబ్ నిర్మించి స్థానిక యువతకు కొలువులు అందించాము. తెలంగాణ రాష్ట్రానికి మోడల్ గా వైకుంటాదామలు,మున్సిపల్ భవనాలు నిర్మించాము.నిజామాబాద్ అభివృద్ధి చూసి కితాబునిచ్చిన మంత్రి వర్యులు కేటీఆర్ నగరం లో ప్రతి డివిజన్ కి కోటి రూ.లు మంజూరు చేశారు.
నిజామాబాద్ నగరాన్ని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాము దీనికి ప్రజలందరు సహకారం అందించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, 36వ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ మాజీ కార్పొరేటర్ ధాత్రిక రేవతి పరమేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎల్ నర్సింహ, కొవూరి జగన్, బొబ్బిలి మురళి, అనిల్ యాదవ్,37వ డివిజన్ కార్పొరేటర్ కంపల్లి ఉమ రాణి ముత్యాలు, బీఆర్ఎస్ నాయకులు ప్యాట సంతోష్, గెంటాల వెంకటేష్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.