ముస్లిం మైనార్టి మండల అధ్యక్షులుగా షేక్ సాదుల్లా 

నవతెలంగాణ- ఎల్లారెడ్డిపేట 
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం లో ఆదివారం ముస్లిం మైనార్టీ కమిటి మండల అధ్యక్షులుగా షేక్ శాదుల్లా, గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ చాంద్ పాషా, షేక్ అజిజ్ , ఉపాధ్యక్షులుగా షేక్ సాహెబ్, మహమ్మద్ రజాక్, మహమ్మద్ ఇర్ఫాన్, షరీఫ్, ఇమామ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ దర్వేష్, కోశాధికారి షేక్ గౌస్, సహాయక కార్యదర్శులు అహెమద్, గఫర్, అస్లమ్, యామిన్, లారి హైమద్ , కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షులు శాదుల్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ మండల అధ్యక్షులుగా నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నూతన కార్యవర్గానికి, మండల ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపారు . మండలంలోని అన్ని సమస్యల పరిష్కారం కోసం, ముస్లిం మైనార్టీ సంఘ అభివృద్ధికి ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తాన్నారు . నూతన అధ్యక్షులకు కార్యవర్గం కు మండల ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love