హైదరాబాద్: లండన్‌లో జరిగిన ప్రత్యేక ప్రివ్యూతో శివ్ నారాయణ్ జ్యువెలర్స్ అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. వాలెస్ కలెక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సుధా రెడ్డి హాజరై సహా హోస్ట్‌గా వ్యవహారించారని పేర్కొంది. ”శివ్ నారాయణ్ జ్యువెలర్స్ కేవలం ఆభరణాలు మాత్రమే కాదని, అభిరుచి, చరిత్ర, తరతరాలుగా సాగే కలల కథ అని ఆ సంస్థ ఎండి తుషార్ అగర్వాల్ పేర్కొన్నారు. తమ సంస్థ 10 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను పొందిందని ఆయన గుర్తు చేశారు.
డిసెంబర్‌లో జైపూర్ జ్యువెలరీ ప్రదర్శన
హైదరాబాద్: వచ్చే డిసెంబర్‌లో జైపూర్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేస్తున్నట్లు జెజెఎస్ గౌరవ కార్యదర్శి రాజీవ్ జైన్ తెలిపారు. హైదరా బాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోడ్‌షోలో వివిధ నగరాల నుంచి పలువురు అభరణాల వర్తకులు జ్యువెలర్స్ హాజరయ్యారు. డిసెంబర్ 22 నుంచి 25వరకు జరగనున్న 21వ ఎడిషన్ ప్రదర్శనకు అంతర్జాతీయ వర్తకులు కూడా హాజరు కానున్నారన్నారు. దాదాపు 40వేల మంది సందర్శకులు హాజరు కావొచ్చన్నారు.