అన్ని మెడికల్‌ కాలేజీల్లో స్కిల్‌ ల్యాబ్‌లు

– డీఎంఈ డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో స్కిల్‌ ల్యాబులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో రాష్ట్రంలోనే తొలి స్కిల్‌ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ లైఫ్‌ సపోర్ట్‌లో అన్ని రకాల అత్యవసర పరిస్థితుల్లో బాధితులను కాపాడేందుకు ప్రాథమికంగా చేయాల్సిన విషయాలను మూడు రోజుల పాటు నేర్పించనున్నట్టు చెప్పారు. తొలి దశలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బదికి ఈ శిక్షణ ఉంటుందనీ, భవిష్యత్తులో ఇతర వృత్తుల వారికి, సామాన్యు లకు శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ శశికళా రెడ్డి మాట్లాడుతూ స్కిల్‌ ల్యాబ్‌ రాకతో విద్యార్థులు మరింత సామర్థ్యంతో, నైపుణ్యంతో సర్జికల్‌, కార్డియాక్‌, ప్రసూతి అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని తెలిపారు.శిక్షణ పొం దిన వారికి జాతీయ గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌ అందజేస్తామని తెలిపారు. మెడికల్‌ గ్రాడ్యుయేట్లు ఈ సర్టిఫికేట్‌ పొందడం తప్పని సరి అని వివరించా రు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ మేడోజు, స్కిల్‌ ల్యాబ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పాండు నాయక్‌ పాల్గొన్నారు.

Spread the love