బడ్జెట్‌లో విద్యారంగానికి స్వల్పంగా పెరిగిన ప్రాధాన్యత

– పీఆర్ టీయూ టిఎస్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు
నవతెలంగాణ – తొగుట
బడ్జెట్‌లో విద్యారంగానికి స్వల్పంగా పెరిగిందని పీఆర్ టీయూ టిఎస్ మండల అధ్యక్షులు రామ చంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకారెడ్డి లు అన్నా రు. ఆదివారం వారు ప్రకటన ద్వారా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవ త్సరానికి గాను గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో  విద్యారంగానికి కేటాయింపులు గతంల కంటే పెరగయని తెలిపారు. రూ.2,75,891.00 కోట్ల బడ్జెట్ లో రూ. 21,389 కోట్లు విద్యారంగానికి కేటాయించారని అన్నారు. ఇది 7.75 శాతం, గత సంవత్సరం 6.7 శాతం మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. పాఠశాల విద్యకు 17,931.42 కోట్లు,(గత సం. 16,092 కోట్లు), ఉన్నత విద్యకు 2959.10 కోట్లు ( 3001 కోట్లు), సాంకేతిక విద్యకు 487.64 కోట్లు కేటాయించారని అన్నారు. మొత్తం గా విద్యారంగానికి కేటాయింపులు పెరిగినప్పటికీ కాంగ్రెస్ మానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా 15 శాతం కెటాయించలేకపోయారని అసహనం వ్యక్తం చేశా రు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకుల విద్యాల యాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కెటాయించటం హర్షణీయం అన్నారు. మెగా డియస్సీ నిర్వహించాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామని నిర్ణయించటం హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రతి మండలంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణా లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు ప్రతిపాదించారని,. అయితే ఈ పాఠశా లలు మండలానికి ఒకటి కాకుండా జనాభా ప్రాతి పదికన అవసరమైన చోట అదనంగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠ శాలలనే పబ్లిక్ స్కూల్స్ గా మార్చి అభివృద్ది చేయాలని గుర్తు చేశారు.
Spread the love