సామాజిక సమానత్వసాధకుడు బీపీ మండల్ జయంతి ఉత్సవాలు..

నవతెలంగాణ- డిచ్ పల్లి
సామాజిక సమానత్వసాధకుడు బీపీ మండల్ జయంతి ఉత్సవాలు శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ  ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీపీ మండల్ సుమారు రెండేళ్లు  బీసీల రాజకీయ, ఆర్థిక ,సామాజిక స్థితిగతులు అధ్యయనం చేసి, బిసిల అభివృద్ధికి  40 అంశాలతో కూడిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారన్నారు. అప్పుడున్న ప్రధాన మంత్రి విపి సింగ్  ఈ రిజర్వేషన్ ను అమలు చేస్తామని  ప్రకటించిన తర్వాత కొన్ని రాజకీయ పక్షాలు కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేయన్నారు. సుప్రీంకోర్టు వైఖరి కూడా బీసీల రిజర్వేషన్ పట్ల భిన్న వైఖరిందనీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపిస్తే 50% దాటకూడదని చెప్పేసి నిబంధన పెట్టి రిజర్వేషన్లు పెంచకూడదని చెప్పి ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. ఈడ్లుఎస్ రిజర్వేషన్ 10% ప్రకటించినప్పుడు రిజర్వేషన్లు 50% నుంచి 60% పెరిగినప్పుడు ఈ కోర్టు ఎటువంటి ప్రకటన చేయకపోవడం  అనుమానస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఎందుకు ఈ భిన్న వైఖరని ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేసి విపి సింగ్  ప్రభుత్వం అందులో ఒక అంశాన్ని పాక్షికంగా అమలు చేశారు. 27% రిజర్వేషన్ ని , దేశం, రాష్ట్రస్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు, బీపీ మండల్ రిజర్వేషన్ల అమలకు దేశంలో ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ పార్టని, మిగిలిన ఏ రాజకీయ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపలేదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసి మండల్ చేసిన సిపార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నరేష్, నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి  సాయి అనిల్, నంద, సాయి ,పవన్, రాజు, నిఖిల్, శివ తదితరులు పాల్గొన్నారు.
Spread the love