టీఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవలు

– హమాలీ వనమా కాలనీలో మంచినీటి బోరు
– ప్రభుత్వ పాఠశాలకు ఆరు కంప్యూటర్లు వితరణ
నవతెలంగాణ-పాల్వంచ
టీఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సామూహిక సేవలు చేశారు. గురువారం పాల్వంచలోని హమాలీ కాలనీ వనమా కాలనీలో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్న వారి సమస్యలు తీర్చేందుకు ట్రస్ట్‌ చైర్మెన్‌ తాండ్ర వెంకటేశ్వరరావు బోరు ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పాల్వంచ మండలం కేపీ జగన్నాధపురం జడ్పీ హై స్కూల్‌ రూ.3,50,000 వేల రూపాయలు విలువ గల హెచ్‌పి డెస్క్‌ 6 కంప్యూటర్‌ లు విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్‌ మూర్తికి గ్రామస్తులు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా తాండ్ర వెంకటేశ్వరావు మాట్లాడుతూ కంప్యూటర్‌ విద్య రానున్న రోజుల్లో చాలా అవసరం అని అన్నారు. చదువు మాత్రమే మనిషిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతుందని, ఇష్ట పడి చదవాలని అన్నారు. తాండ్ర వెంకటేశ్వరావుని గ్రామస్తులు తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల స్టాఫ్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ ఆర్గనైజర్‌ నరాటి ప్రసాద్‌, గ్రామ పెద్దలు కోండం వెంకన్న, పుల్లయ్య, వెంకట నారాయణ, రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు లాయర్‌ గంగాదర్‌ ఆధ్వర్యంలో కొనియాడారు. ఘనంగా సన్మానం చేశారు. గంగాధర్‌ రావు ట్రస్ట్‌ ఆర్గనైజర్‌ నరాటి ప్రసాద్‌, కోరే కృష్ణ, గణేష్‌, రవి, నరేష్‌ పాల్గొన్నారు.

Spread the love