ఎన్‌కౌంటర్‌ మృతుల పేర్లు తెలిపిన మావోయిస్టు పార్టీ

– వివిధ పత్రికల్లో వచ్చిన పేర్లు సరైనవి కావు
– రాంమ్కో( రాంకో హిచామి)
నవతెలంగాణ-చెర్ల
ఈనెల 16న కాంకేర్‌ జిల్లా దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారి పేర్లు ఇతర పత్రికల్లో వచ్చినవి సరైనవి కాదని, సరైన పేర్లు మేము రిలీజ్‌ చేస్తున్నామని దండకారణ్య రివల్యూషనరీ ట్రైబల్‌ ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌ రామ్కో తెలిపారు. ఆ మేరకు పాత్రికేయులకు లేఖ పంపారు. అందులో ముఖ్యంగా 16/4/2024న కాంకేర్‌ జిల్లాలోని ఛోటే వెటియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన మోసం కారణంగా చాలా భయంకరమైన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే ప్రచారంలో ఉన్న పేర్లు సరైనవి కావు. పోలీసులు వెల్లడించిన పేర్లు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అమరవీరుల జాబితా తాము విడుదల చేస్తున్నామని వెల్లడించారు. శంకర్‌ డీవీసీఎం జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా గ్రామం చల్లాగ్రిగ్‌, బద్రు సౌత్‌ బస్తర్‌ కారెగూడెం, అనిత ఈస్ట్‌ బస్తర్‌ ఖోండోస్‌, వినోద్‌ మన్పూర్‌ ప్రాంతం, రీటా మన్పూర్‌ ప్రాంతం, రమేష్‌ ఓయం భైరంగడ్‌ గ్రామం వెచ్చం, బచ్ను గంగలూర్‌ అవకేం, సురేఖ గడ్చిరోలి, మిద్దపల్లి, కవితా నెందుర్‌, రజిత ఆదిలాబాద్‌, భూమే సౌత్‌ బస్తర్‌ విలేజ్‌ అప్పీల్‌, కార్తిక్‌ వెస్ట్‌ బస్తర్‌ గ్రామం మారుమ్‌, రోషన్‌ దర్భా డివిజన్‌, దేవల్‌ గంగలీర్‌ గ్రామం పిడియా, దిను (గుడ్డు) దుర్దా, అన్వేష్‌ సౌత్‌ బస్తర్‌ ఉకుర్‌, జనీలా అలియాస్‌ మోడీ కొవాడి బస్తర్‌ కొరెంజెడ్‌, సంజిల మడకం బస్తర్‌ కరక, గీతా తకిలోడు ఇంద్రావతి, రాజు కురసం ప్రకేలి, షర్మిల ఇంద్రావతి బత్వెడ, సునీల ఇంద్రావతి రేకవై, శాంతిల నార్త్‌ బస్తర్‌ కుమ్డిగుండ, పింటో జిటియుఎం, బజ్నాత్‌ నార్త్‌ బస్తర్‌ వాటేకల్‌, శీలా ఇంద్రావతి ఊట్ల, జైనీ నార్త్‌ బస్తర్‌ వాటేకల్‌ తోపాటు వీరమరణం పొందిన ఇద్దరు సహచరుల వివరాలు అందుబాటులో లేవని ఆ లేఖలో తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ గురించి సవివరమైన సమాచారం తర్వాత ఇవ్వబడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
రహదారులను దిగ్బంధం చేసిన మావోయిస్టులు
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో చిందనార్‌-తుమ్రిగుండ రహదారిని మావోయిస్టులు దిగ్బంధించారు. ఛింద్నార్‌ క్యాంపు నుంచి పహుర్నార్‌ చౌక్‌ నుంచి ఛోటే కర్కా, చెర్పాల్‌, తుమ్రిగుండ వరకు పలు చోట్ల మావోయిస్టులు రహదారులపై రాళ్లు పరచి రాకపోకలు నిలుపుదల చేశారు. బ్యానర్‌ పోస్టర్లు వేసి రోడ్డును దిగ్బంధించారు. రోడ్డుపై రాళ్లు, కొన్ని నినాదాల పోస్టర్లు రాసి చెట్లకు అంటించారు. మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు కూడా వేశారు. అయితే బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, చిద్నార్‌ సిఆర్‌పిఎఫ్‌ భద్రతా బలగాల బృందం రోడ్డును పునరుద్ధరించే పనిలో నిమగమైంది.

Spread the love