
ఈ నెల5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మండలంలో ఉన్న అన్ని గ్రామాలో స్వచ్ఛ దానం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించేలా కృషి చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి జిల్లా హోజింగ్ పీడి రాజకుమార్ అన్నారు.సోమవారం మండలం కేంద్రం లో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. మండలంలో ఉన్న అన్ని గ్రామంలో స్వచదనం పచ్చదనం అనే కార్యక్రమంలో ఐదు రోజుల పాటు ఒక యుద్ధం ల కొనసాగించాలని అధికారులకు సూచించారు.అదే విదంగా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ,ఇంటి స్థలలో, కమన్యునిటీ స్థలాల్లో మొక్కలు అధికంగా నటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.దింతో పాటు గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేల చూడలని గ్రామస్తులకు అవగహన చేపట్టేలా చూడలన్నారు.ప్లాస్టిక్ వినియోగం విడనాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సంరద్భంగా దుకాణదారులకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు.అనంతరం మినీ గురుకుల పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించి లో తరగతి గదులు, వంటగది,పరిసరాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యకం చేశారు. ఆతదుపరి మినీ గురుకుల లో 300 ల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిడిఓ ఉమాదేవి, కార్యదర్శి విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ లక్ష్మి కాంత్ రెడ్డి, మినీ గురుకుల ఇంచార్జి ప్రిన్సిపాల్ జ్యోతి, ఏపింఎం లలిత అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.