శ్రీదర్ బాబుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు

నవ తెలంగాణ-మల్హర్ రావు
జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ మేనిమేస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసేల్ అధ్యక్షుడు దండు రమేష్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్, బొమ్మ రమేష్ రెడ్డి,జంగిడి శ్రీనివాస్, నాయకులు భోగే మల్లయ్య, చెంద్రయ్య, వేల్పుల రవి, జంగిడి సమ్మయ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండలంలోని పెద్దతూండ్లలో శివాలయం దేవాలయం హనుమాన్ ఆలయం వద్ద అంగరంగవైభవంగా పూజలు నిర్వహించారు. మంథని ఎమ్మెల్యేగా ఐదోవసారి అఖండ మెజార్టీతో ఘనవిజయం సాధించి రికార్డులను బ్రేక్ చెసినట్లుగా తెలిపారు. సీఎం రేసులో ప్రధానంగా రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో  అనూహ్యంగా శ్రీదర్ బాబు పెరు తెరపైకి రావడం సంతోషంగా ఉందన్నారు. మంథనిలో ఆరుసార్లు పోటీ చేయగా ఐదు సార్లు గెలుపొంది మాజీ ప్రధాని పివి రికార్డును సైతం బ్రేక్ చేసిన ఘనత శ్రీదర్ బాబుదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సమర్థవంతంగా, విద్యావంతుడు, సౌమ్యుడిగా పేరుపొందిన శ్రీదర్ బాబును ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు బండ లావణ్య విష్ణు వర్ధన్ రెడ్డి, సర్పంచ్ రాజునాయక్, అడ్వాల మహేష్, శ్రీనివాస్ రెడ్డి, కుర్రె నరేశ్, కీర్తి రాములు, మెట్టు రాములు, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love