నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం ఈ నెల 2న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్‌లో ప్రిలిమనరీ కీని చూడొచ్చు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిదే తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్‌లో తెలపాలని సూచించింది.