ఇప్పటికీ ఆకలి చావులు బాధాకరమే

– గజరావు భూపాల్‌ ఐపీఎస్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ఇప్పటికీ ఆకలి చావులు అంటూ వినడం బాధాకరమేనని ఐపీఎస్‌ అధికారి డీఐజీ గజరావు భూపాల్‌ అన్నారు. ”వరల్డ్‌ హంగర్‌ డే” పురస్కరించుకొని సోమాజిగూడ లోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంలో నిర్వహించిన కార్యక్రమనికి అతిథులుగా డీఐజీ గజరావు భూపాల్‌ (డైరెక్టర్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌), పి.ఎ, ప్రవీణ్‌, ( హెడ్‌ ఆఫ్‌ రిటైల్‌ ఆపరేషన్‌, మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌), సిరాజ్‌ పీ.కే లు హాజరై ”హంగర్‌ ఫ్రీ వరల్డ్‌” లోగోను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్‌ డెవలప్మెంట్‌ గోల్‌-2 జీరో హంగర్‌ ప్రోగ్రాంకు మద్దతుగా ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం 31 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ 51 వేల పౌష్టికాహార ప్యాకెట్లు పంపిణీ చేయబోతునన్నట్టు వివరించారు. ”థనల్‌ దయ రిహాబిలేషన్‌ ట్రస్ట్‌” సహాయంతో ”హంగర్‌ ఫ్రీ వరల్డ్‌” ప్రోగ్రాం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం గల్ఫ్‌ దేశాల్లోని కొన్ని కేంద్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 16 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 37 నగరాల్లో అమలు చేయబడుతుందని, 16 రాష్ట్రాల్లోని 70 నగరాల్లో అమలు చేయబోతున్నట్టు వారు తెలిపారు. ఇలాంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే 246 కోట్ల రూపాయలను మలబార్‌ గ్రూప్‌ ఖర్చు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్‌ గోల్డ్‌ సిబ్బంది, పాల్గొన్నారు.

Spread the love