గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుంది: ప్రభుత్వ విప్

నవతెలంగాణ-భిక్కనూర్
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో 17 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, చిన్న గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలను ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజమౌళి, గ్రామ సర్పంచ్ లక్ష్మీ రాజలింగం, ఎంపీటీసీ సభ్యులు సాయా గౌడ్, మంజుల రాములు, సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, అధికార పార్టీ మండల రైతు విభాగం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు సుదర్శన్, మాధవి, తాసిల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీవో అనంతరావు, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు నరసింహులు యాదవ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మధుమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, సొసైటీ ఉపాధ్యక్షులు విట్టల్, గ్రామ ఉపసర్పంచ్ చంద్రకళ, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love