ధర్మారం గురుకుల విద్యార్ధులకు రాష్ట్ర స్థాయి మార్కులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ బి సంగీత  ఒక ప్రకటనలో తెలిపారు.  ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో యం పి సి నందు జి మేఘన , టి లక్కీ  470 మార్కులకు గాను 468 , ఆర్ రిషిక 467, బి అశృత 466 సాధించారు.  బై పి సి లో 440 గాను   కె . వైష్ణవి, 438, యం. జోయ్ సి  , టి కీర్తన,  ఆర్ నైనిక 436 మార్కులు సాధించారని పేర్కొన్నారు సీనియర్ ఇంటర్ లో బై పి సి నందు కె స్రవంతి 987, టి దేవి 985 మార్కులు సాధించారు , యం పి సి నందు బి వర్ష , బి జయశ్రీ , పి అభినయ 979 మార్కులు  వై సంద్య , కె అస్మిత 977 తో రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిశారు. ఇంటర్ ఫలితాలలో 99 %  ఉత్తీర్ణత సాధించారు  ఉత్తమ  ఫలితాలను సాధించిన విద్యార్ధులను కళాశాల ప్రిన్సిపాల్ బి సంగీత  అధ్యాపక  బృందం అభినందించారు.
Spread the love