మిల్లర్ల ఆగడాలు అరికట్టి వెంటనే ధాన్యాన్ని తరలించాలి

– కాంగ్రెస్‌ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్‌
నవతెలంగాణ-గోవిందరావుపేట
మిల్లర్ల ఆగడాలను సిండికేట్‌ సిస్టంను అరికట్టి వెంటనే ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలం లోని చల్వాయి గ్రామంలో తడిసి పేరుకుపోయి తోలకుండా మిగిలిపోయిన ధాన్యం బస్తాలను పరిశీలించారు అనంతరం 163 వ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతే రాజు అని చెప్పే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. క్వింటాకు 10 కిలోల తరుగును విధిస్తూ రైతుల ను దోచుకుంటు న్నాయ ని ఆరోపించారు. ములుగు జిల్లాలో వరి ధాన్యం సాగు ఎక్కువ అని తెలిసిన మిల్లులను కేటాయిం చకుండా, కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యపు బస్తాలు ఇంకా అక్కడే ఉండడంతో సరైన వసతులు లేక, అకాల వర్షాల వల్ల తడిసిపోయాయన్నాఉ. వాహనాలు రాక రవాణా జరగక రైతులు వాహనాలకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక రవాణాకు ఉచితంగా దొరికే వాహనాలు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి దొరక్కపోవడం విడ్డూరం అన్నారు. ములుగు లారీ అసోసియేషన్‌ వారు రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని, వాహనాలు పెట్టి ధాన్యాన్ని తరలించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పండించిన ప్రతి గింజను మరియు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని, కొనుగోలు కేంద్రాలలో సరైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, పంట నష్ట పరిహారం కల్పించాలన్నారు. లేదంటే రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని, కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్‌, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, ఎస్‌.సి.సెల్‌ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్‌ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్‌ పాషా, కిసాన్‌ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్‌, జిల్లా నాయకులు కణతల నాగేందర్‌ రావు, వెంకటాపూర్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బండి శ్రీనివాస్‌, మండల మహిళ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.
యువత అధిక సంఖ్యలో పాలొనాలి
రాజీవ్‌ గాంధీ యూత్‌ క్విజ్‌ కార్యక్రమంలో యువత అత్యధికంగా పాల్గొని బహుమతులను గెలుచుకోవాలని ములుగు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్‌ పిలుపునిచ్చారు. మంగళ వారం మండలంలోని చల్వాయి గ్రామంలో మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీతారాం నాయక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశ:లో ఆయన మాట్లాడారు. ముందుగా రాజీవ్‌ గాంధీ యూత్‌ కిస్‌ కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించారు. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ స్ఫూర్తిగా రాజీవ్‌ గాంధీ యూత్‌ క్విజ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనానరు. ఈ కార్యక్రమాన్ని సద్విని యోగ పర్చుకొని బహుమతులు గెలుచుకోవాలని జిల్లా యువతకు పిలుపునిచ్చారు. ఆన్లైన్‌లో పేరు నమోదు కోసం 7661899899 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే రిజిస్ట్రేషన్‌ లింక్‌ వస్తుందని, తద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. చివరి తేదీ 17 అని, ఆన్లైన్‌ పరీక్ష 18న ఉంటుందన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి నలభై మందికి బహుమతులు అందజేస్తారనానరు. ప్రతి నియోజ కవర్గం నుండి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటీ అందజేస్తామన్నారు.

Spread the love